Saturday, 26 September 2026 12:25:54 PM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్త్రీ నిధి సమీక్ష కమిటీ సమావేశం*

Date : 29 July 2026 09:44 PM Views : 64

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో జిల్లా ఫిర్యాదుల పరిష్కార సమావేశ మందిరంలో స్త్రీ నిధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా మేనేజర్ రవికుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్‌డీఓ)తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.సమావేశంలో జిల్లా మేనేజర్ రవికుమార్ జిల్లాలో స్త్రీ నిధి పురోగతిని వివరిస్తూ రుణాల పంపిణీ, రికవరీ, మోసాలు–దుర్వినియోగం కేసులు, స్త్రీ నిధి యాప్ పనితీరు, స్వయం సహాయక సంఘాల ద్వారా నేరుగా స్త్రీ నిధికి చెల్లింపుల విధానం, స్త్రీ నిధి యాప్, పీఓఎస్ యంత్రాలు, బీబీపీఎస్ ద్వారా చెల్లింపుల ప్రక్రియ తదితర అంశాలను వివరించారు.అనంతరం జిల్లా కలెక్టర్ రుణాల పంపిణీ, బకాయిల వసూళ్లలో వెనుకబడిన మండలాల పనితీరును సమీక్షించారు. కావాలనే రుణాలు చెల్లించకుండా బకాయిలు పెండింగ్‌లో ఉంచిన సభ్యులపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే భూ భారతి వ్యవస్థలో భూములను బ్లాక్ చేసే చర్యలు చేపడతామని హెచ్చరించారు.అదేవిధంగా బినామీ రుణాలు, రుణాల దుర్వినియోగం,మోసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,ఇందులో నిర్లక్ష్యం లేదా తప్పిదం చేసిన సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి స్త్రీ నిధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించడంతో పాటు, తక్కువ పనితీరు ఉన్న మండలాల సిబ్బందితో ప్రతి నెల సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.స్త్రీ నిధి మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాకు ప్యాడీపై వచ్చిన కమిషన్ మొత్తంగా రూ.1.92 కోట్లను స్త్రీ నిధి సంకల్ప డిపాజిట్‌గా జమ చేసినట్లు వెల్లడించారు. ఈ డిపాజిట్‌పై భారతీయ స్టేట్ బ్యాంకు వడ్డీ రేటుతో పోలిస్తే అదనంగా ఒక శాతం వడ్డీ చెల్లించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలోజిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి,అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, సెర్ప్,మెప్మా అధికారులు,జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, మండల సమన్వయకర్తలు,స్త్రీ నిధి అసిస్టెంట్ మేనేజర్లు, మేనేజర్లు, ప్రాంతీయ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :