Friday, 25 September 2026 10:40:49 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

శ్రీ పోచమ్మ తల్లి గుడిలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం

Date : 05 July 2026 08:34 PM Views : 113

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్‌పూర్ బీరంగూడలోని లక్ష్మీసాయి మిడోస్ కాలనీలో వెలసిన శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ప్రత్యేక పూజలు, హోమాలు, ధార్మిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.ఈ పుణ్యకార్యానికి అమీన్‌పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ శశిధర్ రెడ్డి, వారి సతీమణి లావణ్య దాతలుగా వ్యవహరించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద సేవను అందిస్తూ తమ భక్తిశ్రద్ధను చాటుకున్నారు. ఈ పవిత్ర మహోత్సవంలో భాగస్వాములు కావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే శివాలయం చైర్మన్ సుధాకర్, ప్రముఖ నాయకులు దండు రమేష్, మహేష్, మున్న విజయ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు.ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు మల్లేష్, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన దాతలకు, ముఖ్య అతిథులకు, కాలనీవాసులకు, భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరి సేవాభావం అభినందనీయమని కొనియాడారు.అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన శశిధర్ రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని శ్రీ పోచమ్మ అమ్మవారిని ప్రార్థించారు.ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసిన ఆలయ కమిటీ సభ్యులకు, కాలనీవాసులకు, భక్తులకు, అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ పోచమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :