Monday, 10 August 2026 10:52:09 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

కాంగ్రెస్‌లో ఫ్లెక్సీల వివాదం..పటాన్‌చెరులో వర్గ విభేదాలు బహిర్గతం*

అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు సన్నాహాలు*

Date : 01 July 2026 05:28 PM Views : 73

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఫ్లెక్సీలను పార్టీకి చెందిన వారే చింపివేశారంటూ ఆరోపణలు రావడంతో స్థానిక నాయకుల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రామచంద్రాపురంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన అవగాహన, శిక్షణ కార్యక్రమానికి మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు హాజరుకానున్న నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు శాపురం నరసింహారెడ్డి కన్వెన్షన్ హాల్ ముఖద్వారం వద్ద స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అయితే కార్యక్రమానికి ముందు వాటిలో కొన్ని చించివేయబడినట్లు తెలిసింది.ఈ ఘటనపై ఒక వర్గం నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, పార్టీకి చెందిన వారే ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.మరోవైపు, ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో పార్టీ ప్రోటోకాల్ పాటించలేదని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై కూడా పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.పార్టీలో సమన్వయం లోపించడం, వర్గ విభేదాలు పెరగడం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్గత విభేదాలు పార్టీకి నష్టం కలిగించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకుడు శాపురం నరసింహారెడ్డి స్పందిస్తూ, నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న తన ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగానే చింపివేశారని ఆరోపించారు.రాజకీయంగా ఎదుర్కోవాల్సింది పోయి ఇలాంటి చర్యలకు పాల్పడడం బాధాకరమని అన్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :