Saturday, 26 September 2026 11:24:50 AM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

పి.వి. నరసింహారావు జయంతి సందర్భంగా ప్రణీత్ నైట్ వుడ్స్‌లో రక్తదాన శిబిరం

Date : 28 June 2026 02:38 PM Views : 58

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని ప్రణీత్ నైట్ వుడ్స్ కాలనీలో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ చారి మాట్లాడుతూ, పి.వి. నరసింహారావు తెలుగు జాతికి చెందిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణ విధానాల వల్ల అనేక అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు భారతదేశానికి వచ్చాయని, తద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించి దేశ అభివృద్ధికి దోహదపడిందని పేర్కొన్నారు. అలాంటి మహనీయుడిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని, ఆయన జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.పి.వి. నరసింహారావు ట్రస్ట్‌కు చెందిన వైద్యుడు మాట్లాడుతూ, ప్రణీత్ గ్రూప్ మరియు నైట్ వుడ్స్ కాలనీ అసోసియేషన్ చేపట్టిన రక్తదాన శిబిరం అభినందనీయమని అన్నారు. రక్తదానం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం లభిస్తుందని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :