Monday, 10 August 2026 10:51:34 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

చైతన్య నగర్ ఎస్సీ శ్మశాన వాటికలో స్నానాల గదులు, విడిది గృహం ప్రారంభం

Date : 03 July 2026 04:53 PM Views : 94

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు పట్టణంలోని చైతన్య నగర్ కాలనీలో ఉన్న ఎస్సీ శ్మశాన వాటికలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ సొంత నిధులతో నిర్మించిన స్నానాల గదులు, విడిది గృహాన్ని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ, చైతన్య నగర్ కాలనీలోని ఎస్సీ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించే కాలనీవాసులకు స్నానాల కోసం సరైన సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా మహిళలు మరింత ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో సొంత నిధులతో స్నానాల గదులు, విడిది గృహం నిర్మించినట్లు తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ సంఘం సభ్యులు మాట్లాడుతూ, శ్మశాన వాటికలో స్నానాల గదులు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో మెట్టు కుమార్ యాదవ్ వెంటనే స్పందించి సొంత నిధులతో స్నానాల గదులు, విడిది గృహం నిర్మించడం అభినందనీయమని అన్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సంఘం అధ్యక్షుడు బయగల్ల కృష్ణ, రుద్రారం శంకర్, రాములు, శంకర్, శ్రీరాములు, కొమరగూడెం వెంకటేష్, బలవంత్, భూపాల్, బొద్దుగారి విజయ్, మల్లేష్, బ్యాగరి శ్రీనివాస్, సుకన్య, కర్నె బాలు, బయగల్ల బలరాజ్, ఆల్విన్ కాలనీ అధ్యక్షుడు సత్యనారాయణ, మెట్టు ఎల్లేష్, రవీంద్ర చారి, శాంతి నగర్ కాలనీ అధ్యక్షుడు అంజిరెడ్డి, నిజామాబాద్ శ్రీను, రాజు, గుండమొల్ల రాజు, అజ్మత్ అజ్జూ, మెట్టు కళ్యాణ్ యాదవ్, తిరుపతి రెడ్డి, అఫ్జల్, జయశ్రీ, అజ్మేరి బేగం, చంద్రకళ, అనురాధ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :