Friday, 25 September 2026 10:43:41 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

పటాన్‌చెరు మార్కెట్ యార్డులో బురద.. అడుగడుగునా అవస్థలు

Date : 22 July 2026 08:44 AM Views : 73

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ యార్డు బురదమయంగా మారింది. యార్డు ప్రాంగణమంతా బురద, నీరు నిల్వ ఉండటంతో రైతులు, కూరగాయల వ్యాపారులు, కూలీలు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడుగడుగునా బురద ఉండటంతో నడిచి వెళ్లడమే కష్టంగా మారిందని ప్రజలు వాపోతున్నారు.ముఖ్యంగా కూరగాయలు విక్రయించే వ్యాపారులకు కనీసం కూర్చునేందుకు కూడా స్థలం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బురదలోనే వ్యాపారం నిర్వహించాల్సి వస్తోందని, దీంతో వ్యాపార కార్యకలాపాలు కూడా ప్రభావిత మవుతున్నాయని తెలిపారు.వర్షపు నీరు నిల్వ ఉండటంతో పరిశుభ్రత దెబ్బతింటోందని, జారిపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డులో తక్షణమే బురదను తొలగించి, నీరు నిల్వ కాకుండా చర్యలు చేపట్టాలని రైతులు, వ్యాపారులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.అలాగే మార్కెట్ యార్డులో శాశ్వత పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసి,వర్షాకాలంలో బురదసమస్యపునరావృతంకాకుండాశాశ్వతపరిష్కారం చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :