Wednesday, 11 November 2026 12:57:43 AM
# యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.50 లక్షల విరాళం..దాతలు ముందుకు రావడం సంతోషం: డిజిపి సి. వి. ఆనంద్ # పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం.. అప్రమత్తంగా ఉండాలి # యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న* # భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రత్యేక పూజలు # సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి కలకలం.. రైతుల్లో భయాందోళన # పేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.60 వేల ఆర్థిక సహాయం # గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని బీజేపీ నాయకుల ధర్నా* # పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.50 లక్షల విరాళం..దాతలు ముందుకు రావడం సంతోషం: డిజిపి సి. వి. ఆనంద్

సైబరాబాద్ - పోలీసు కుటుంబాల పిల్లల విద్యాభివృద్ధికి చేయూత: ఆప్టిమస్ గ్రూప్ ఛైర్మన్ డి. శ్రీనివాసరెడ్డి

Date : 10 November 2026 09:39 PM Views : 8

ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ఆప్టిమస్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ పార్ట్‌నర్ డాక్టర్ డి. శ్రీనివాసరెడ్డి రూ.50 లక్షల విరాళం అందించారు. మంగళవారం మైండ్ స్పేస్ లోని పెరెల్ క్లబ్ లో నిర్వహించిన ఓపెన్ హౌస్ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్‌కు విరాళం చెక్కును అందజేశారు.ఈ నిధులను పాఠశాలలో తరగతి గదులు, సైన్స్, టెక్నాలజీ ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా వసతులు, డిజిటల్ విద్యా సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నారు. పోలీసు సిబ్బంది పిల్లలతోపాటు సాధారణ ప్రజల కుటుంబాలకు చెందిన పిల్లలకు సైతం సమాన ప్రాతిపదికన నాణ్యమైన విద్యను అందించడమే ఈ పాఠశాల లక్ష్యం.విరాళం అందించిన డాక్టర్ శ్రీనివాసరెడ్డిని డీజీపీ సీవీ ఆనంద్ ఈ సందర్భంగా అభినందించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో అత్యుత్తమ విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు, దాతలు ముందుకొచ్చి సహకారం అందించాలని ఆయన సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, క్రీడలు, ఇతర రంగాల్లోనూ మెరుగైన అవకాశాలు కల్పించేలా పాఠశాలను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పోలీసులంటే తనకు ఎంతో గౌరవమని, సమాజ భద్రత కోసం వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. పోలీసు కుటుంబాల పిల్లల విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో విరాళం ఇచ్చినట్లు తెలిపారు. విద్య ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, ఎస్‌ఎస్‌సీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, ఐటీ రంగానికి చెందిన సంస్థలు, ఆర్టీసీ, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :