ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల (టీయూడబ్ల్యూజే) సంగారెడ్డి జిల్లా మహాసభ పోస్టర్‌ను పటాన్‌చెరులో స్థానిక జర్నలిస్టుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ నెల 9న సంగారెడ్డి పట్టణంలోని టీఎన్‌జీవో భవన్‌లో జరగనున్న జిల్లా మహాసభను విజయవంతం చేయాలని ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు రుమాండ్ల అనిల్‌కుమార్ పిలుపునిచ్చారు.పటాన్‌చెరు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రుమాండ్ల అనిల్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పర్చ శ్రీనాథ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం టీయూడబ్ల్యూజే రాష్ట్రవ్యాప్తంగా కృషి చేస్తోందన్నారు. సంగారెడ్డిలో జరిగే జిల్లా మహాసభలో జిల్లా కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ తొలిసారిగా సంగారెడ్డి జిల్లాకు రానున్న సందర్భంగా ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న పాత్రికేయులు మహాసభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు నర్రా రామారావు, సయ్యద్ సులేమాన్, కాశీపతి, పత్తి నరసింహ, ఏబీఎన్ యాదగిరి, బసవేశ్వర్, బాలు, శ్రీనివాసరెడ్డి, బీసీఎన్ శ్రీనివాస్, మాజీద్ అలీ, మడపటి శేఖర్, వివేక్, కోటేష్, శివాజీ, ప్రభాకర్ యాదవ్, సిద్దు, రాము, సంజీవ, రాజు, సలీం, విజయ్ కుమార్, బండి పురుషోత్తం, శంకర్, దశరత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు