ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి బుధవారం పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు చైతన్య నగర్, సీతారాంపురం కాలనీ, నర్ర బస్తీ, నాయికోటి బస్తీలలో పర్యటించి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు, భక్తులతో ఆదిత్యరెడ్డి మాట్లాడి ఉత్సవాల నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం పలు ప్రాంతాల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు.ఈ సందర్భంగా ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు ప్రజలందరిలో భక్తిభావంతో పాటు ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొంటూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మండపాల నిర్వాహకులు ఆహ్వానం మన్నించి కార్యక్రమాలకు హాజరైన ఆదిత్యరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Admin
ప్రజా పిలుపు