Sunday, 08 November 2026 02:23:29 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

దీపావళి టపాసుల విక్రయదారులకు ఫైర్ సీఐ నాగేందర్ సూచనలు

Date : 01 November 2026 11:07 AM Views : 78

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పటాన్‌చేరు పట్టణంలోని మైత్రి మైదానంలో దీపావళి పండుగను పురస్కరించుకొని టపాసుల విక్రయాలకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా టపాసుల వ్యాపారులకు ఫైర్ సీఐ నాగేందర్ పలు కీలక సూచనలు చేశారు. మైత్రి మైదానంలో కేవలం 30 దుకాణాలకు మాత్రమే టపాసుల విక్రయాల అనుమతులు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అనుమతులు పొందిన వ్యాపారులు మాత్రమే విక్రయాలు చేపట్టాలని తెలిపారు.టపాసుల విక్రయ కేంద్రాల వద్ద ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి దుకాణం వద్ద ఇసుక, నీరు, అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌కు అవకాశం లేకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. దుకాణాల వద్ద పొగతాగడం, నిప్పు వెలిగించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫైర్ సీఐ నాగేందర్ సూచించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :