ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ వేదికగా రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ వద్ద స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ నాయకుడు దేవని సతీష్ 1,000 డప్పులతో ఫామ్‌హౌస్ ముట్టడికి పిలుపునిచ్చారు. మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల దాడిని నిరసిస్తూ మర్కూక్‌లో ధర్నాకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. దీంతో సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి, మర్కూక్ ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Admin
ప్రజా పిలుపు