Thursday, 24 September 2026 08:55:50 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

కాంగ్రెస్ హామీల అమలులో విఫలం: సింధు ఆదర్శ్ రెడ్డి*

భారతి నగర్ డివిజన్‌లో ‘బాకీ కార్డుల’ పంపిణీ*

Date : 02 September 2026 07:45 PM Views : 41

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న ‘కాంగ్రెస్ పార్టీ 420 మోసాలపై బీఆర్‌ఎస్ పార్టీ పోరుబాట’లో భాగంగా బుధవారం భారతి నగర్ డివిజన్ ఎల్‌ఐజీ కాలనీలో బాకీ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన సంక్షేమ హామీలు, వాటి కింద ప్రజలకు అందాల్సిన ప్రయోజనాల వివరాలను ఆమె ప్రజలకు వివరించారు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులు, దివ్యాంగులు, బీడీ కార్మికులకు పెన్షన్లు, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, రైతు రుణమాఫీ, కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ కింద తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, వరి పంటకు బోనస్, రైతు కూలీలకు ఆర్థిక సాయం, విద్యా భరోసా కార్డు, ఆటో కార్మికులకు ఆర్థిక సహాయం వంటి హామీలను గుర్తుచేశారు.వెయ్యి రోజులు.. 33 నెలల పాలనలో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఎన్నికల హామీలను అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలి” అని సింధు ఆదర్శ్ రెడ్డి డిమాండ్ చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :