ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు: శ్రావణ మాస బోనాల సందర్భంగా జేపీ కాలనీ డివిజన్ బండ్లగూడ పరిధిలోని మర్క్స్ నగర్లో నిర్వహించిన శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో బీఆర్ఎస్ నాయకులు, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పార్థు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. శ్రావణ మాస బోనాల సందర్భంగా మర్క్స్ నగర్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Admin
ప్రజా పిలుపు