ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : , వనమహోత్సవం సందర్భంగా నర్సాపూర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆధ్వర్యంలో రెడ్డిపల్లి గ్రామ చెరువు గట్టుపై 1,000 ఈత మొక్కలను నాటారు.ఈ కార్యక్రమాన్ని నేషనల్ అగ్రో ఫౌండేషన్ సంస్థ సహకారంతో నిర్వహించారు. చెరువు గట్టు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ మొక్కల నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ ముస్తఫా, ఎక్సైజ్ ఎస్‌ఐ అరుణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.వనమహోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా ప్రకృతి సంపదను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది రవి, షాహెద్, మహేష్, గ్రామ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక గ్రామస్తులు, గౌడ సంఘ సభ్యులు, ఎఫ్‌ఏ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు