ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే ర్యాలీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సూచించారు. ఈ మేరకు ముస్లిం మత పెద్దలు, ర్యాలీల ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులతో ఎస్పీ పీస్ మీటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.ఒకరి మత సంప్రదాయాలను మరొకరు గౌరవించుకున్నప్పుడే సమాజంలో మత సామరస్యం, శాంతి నెలకొంటుందని పేర్కొన్నారు. ర్యాలీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించామని తెలిపారు.ర్యాలీలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.అలాగే వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యే ఫేక్, ఫార్వర్డ్ మెసేజ్‌లను నమ్మవద్దని ఎస్పీ సూచించారు. తమకు వచ్చిన సందేశంలో వాస్తవం ఎంత ఉందో నిర్ధారించుకున్న తర్వాతే ఇతరులకు ఫార్వర్డ్ చేయాలని తెలిపారు. అనుమానాస్పద సందేశాలు వచ్చినప్పుడు సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.ఫార్వర్డ్ మెసేజ్‌ల ద్వారా అనవసర గొడవలు, అల్లర్లకు కారణమయ్యేలా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.పండుగను శాంతియుతంగా, సోదరభావంతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
Admin
ప్రజా పిలుపు