Friday, 25 September 2026 10:13:54 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

అమీన్‌పూర్‌లో చిట్టీల పేరిట రూ.2.5 కోట్ల మోసం

భార్యాభర్తల పరార్‌*..బాధితుల ఆందోళన..పోలీసులకు ఫిర్యాదు*

Date : 03 August 2026 02:07 PM Views : 67

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిట్టీల పేరిట రూ.2.5 కోట్లకు పైగా వసూలు చేసి ఓ దంపతులు రాత్రికి రాత్రే పరారైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సాంబశివరావు, శిరీష దంపతులు అమీన్‌పూర్‌లోని బీఎస్‌ఆర్ కాలనీలో గత 20 ఏళ్లుగా నివాసముంటున్నారు.స్థానికులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్న వీరు, ప్రతి నెలా పెద్ద మొత్తంలో చిట్టీల వసూళ్లు ప్రారంభించారు.ప్రారంభంలో క్రమం తప్పకుండా చెల్లింపులు చేయడంతో కాలనీవాసులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా వీరి వద్ద లక్షలాది రూపాయలు చిట్టీల రూపంలో జమ చేశారు.ఇటీవల చిట్టీల గడువు ముగిసి డబ్బులు చెల్లించాల్సి రావడంతో, రకరకాల కారణాలు చెబుతూ కాలయాపన చేస్తూ వచ్చారు.అనుమానం వచ్చిన స్థానికులు పరిశీలించగా, దంపతులు తమ సొంత ఇంటిని విక్రయించి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఊరు విడిచి పారిపోయినట్లు తెలిసింది. సుమారు 20 మందికి పైగా బాధితుల నుంచి రూ.2.5 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న దంపతుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :