ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : రామచంద్రపురం: బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులపై రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 3న రామచంద్రపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కానుకుంటలో ప్రీతి ఆసుపత్రి సమీపం నుంచి బాలికను నిందితులు ఆటో రిక్షాలో తీసుకెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఓ ప్రదేశంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.సెప్టెంబర్ 4న అర్థరాత్రి రామచంద్రపురంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రి రోడ్డుపై బాలికతో పాటు నిందితులను స్థానికులు గమనించి డయల్-112కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రామచంద్రపురం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.బాధిత బాలిక ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నారు.
Admin
ప్రజా పిలుపు