Sunday, 08 November 2026 06:58:20 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రథమ ప్రాధాన్యత

*ఉస్మాన్‌నగర్ బి-మ్యాక్ కాలనీలో సీసీ రోడ్డు, రక్షిత మంచినీటి సరఫరా ప్రారంభించిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Date : 02 October 2026 07:17 PM Views : 124

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్‌నగర్ బి-మ్యాక్ సొసైటీ కాలనీలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేష్ సొంత నిధులతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును, ఇంటింటికీ రక్షిత మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైన ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.కాలనీ అభివృద్ధికి సొంత నిధులతో సహకరిస్తున్న మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేష్‌ను ఎమ్మెల్యే అభినందించారు. కాలనీల అభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.రక్షిత మంచినీటి సరఫరాకు సహకరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి, రాములు గౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :