ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బొంతపల్లి గ్రామంలో ఓ మూసివేసిన భవనంలో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న 16 మందిని గుమ్మడిదల పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..ఆదివారం తెల్లవారుజామున 12.20 గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు గుమ్మడిదల ఎస్‌ఐ సిబ్బందితో కలిసి బొంతపల్లి గ్రామంలోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న భవనంపై దాడి చేశారు.అక్కడ డబ్బుల కోసం పేకాట ఆడుతున్న 16 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.40,650 నగదు, 16 మొబైల్ ఫోన్లు (15 స్మార్ట్‌ఫోన్లు, ఒక నోకియా కీప్యాడ్ ఫోన్), ఐదు ద్విచక్ర వాహనాలు, ఒక మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో కారును స్వాధీనంచేసుకున్నారు.పంచనామా నిర్వహించిన అనంతరం తెలంగాణ గేమింగ్ యాక్ట్‌లోని సెక్షన్లు 3, 4 కింద కేసు నమోదు చేయనున్నట్లు గుమ్మడిదల పోలీసులు తెలిపారు. కేసు క్రైం నంబర్ 203/2026గా నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Admin
ప్రజా పిలుపు