Thursday, 24 September 2026 08:55:47 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

బీరంగూడ గుట్ట ఆలయ హుండీ లెక్కింపు

200 రోజుల్లో రూ.13.69 లక్షల ఆదాయం

Date : 09 September 2026 07:45 PM Views : 59

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: బీరంగూడ గుట్టపై కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో 200 రోజుల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. హుండీ ద్వారా మొత్తం రూ.13,69,009 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.సంగారెడ్డి దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ రంగారావు సమక్షంలో హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి దేవనాదం, చైర్మన్ సుధాకర్ యాదవ్ పర్యవేక్షణలో దేవాదాయ శాఖ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తుల సహకారంతో లెక్కింపు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి దేవనాదం మాట్లాడుతూ హుండీ ద్వారా సమకూరిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి భక్తుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ 200 రోజుల హుండీ లెక్కింపులో రూ.13,69,009 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. లెక్కింపు కార్యక్రమానికి సహకరించిన భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హుండీ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని వెల్లడించారు. ఆలయ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిటీ సభ్యులు, సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్, ప్రధానార్చకులు ప్రహ్లాద్, అధికారులు, మహిళా భక్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :