ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : 25 :పటాన్‌చెరు నియోజకవర్గం బీరంగూడలో శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ భవాని ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మికత, భక్తిభావం, బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం పట్ల భక్తులు, బంజారా సమాజ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ భవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలిచారని, ఆయన ఆశీస్సులతో సమాజంలో ఐక్యత, సోదరభావం, ఆధ్యాత్మిక చైతన్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తై భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో బంజారా సమాజ నాయకులు, మహిళలు, యువత, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు