Friday, 25 September 2026 10:02:31 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

సిరిసిల్ల జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం

*41,147 మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందించేందుకు 393 బూత్‌లు ఏర్పాటు*

Date : 28 June 2026 02:46 PM Views : 65

ప్రజా పిలుపు / తెలంగాణ / రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదివారం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పోలియో వ్యాక్సిన్ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 0 నుంచి 5 ఏళ్లలోపు 41,147 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ అందించేందుకు 393 పోలియో బూత్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంకా రెండు రోజుల పాటు వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని వెల్లడించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ వ్యాక్సిన్‌ను ప్రతి చిన్నారికి తప్పనిసరిగా వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు సహకరించాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, డీఎంహెచ్‌ఓ ఏంజెలా ఆల్ఫ్రెడ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నాగేంద్ర బాబు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :