ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : రుద్రారం శ్రీ గణేష్‌గడ్డ సిద్ది గణపతి ఆలయంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు 9వ రోజు శ్రీ సిద్ధి గణపతి స్వామివారు శ్రీ లక్ష్మీ గణపతి రూపంలో భక్తులకు ప్రత్యేక దర్శనమిస్తున్నారు.ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Admin
ప్రజా పిలుపు