Saturday, 26 September 2026 11:23:26 AM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

రూ.70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్

Date : 07 July 2026 05:26 AM Views : 91

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు ఓ రైతు నుంచి రూ.70 వేల లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్, ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.ఏసీబీ అధికారుల సమాచారం మేరకు, సంబంధిత రైతు తన భూమి మార్పిడి ప్రక్రియ కోసం తహసీల్దార్‌ను సంప్రదించగా, పని పూర్తి చేయాలంటే రూ.70 వేల లంచం ఇవ్వాలని దిలీప్ నాయక్ డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు పథకం ప్రకారం లంచం అందజేస్తుండగా అధికారులు తహసీల్దార్‌ను పట్టుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. పట్టుబడిన తహసీల్దార్‌ను విచారణ అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు సమాచారం.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :