Thursday, 24 September 2026 08:06:18 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి వేడుకలు*

బీరంగూడలో ఘనంగా మహా అన్నదానం.. 5 వేల మందికి అన్నప్రసాదం

Date : 22 September 2026 04:16 PM Views : 20

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బీరంగూడ గుట్ట కమాన్‌ వద్ద శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గత 15 ఏళ్లుగా కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ వస్తున్నారు.ఉత్సవాల్లో భాగంగా భారీ గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి అనంతరం గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా సుమారు 5 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించారు. బీరంగూడ, అమీన్‌పూర్‌తో పాటు పటాన్‌చెరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో మాజీ నాయకులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్, కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. గత 15 ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడంతో పాటు మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రశంసించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :