ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 7 క్వింటాళ్ల చికెన్ వ్యర్థాలను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. పది బ్యాగుల్లో నింపిన చికెన్ వ్యర్థాలను పటాన్చెరు నుంచి చెంగిచెర్లకు తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు.టీ జీ 11 పి 6431 నంబర్ గల వాహనంలో చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న అయాన్, మహమ్మద్ ఉమర్ అనే ఇద్దరు వ్యక్తులపై పటాన్చెరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తదుపరి విచారణ చేపట్టినట్లు తెలిసింది.
Admin
ప్రజా పిలుపు