Thursday, 24 September 2026 12:10:48 PM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

జీఎంఆర్ కన్వెన్షన్ హాల్ గేట్‌కు తాళం.. బీఆర్‌ఎస్ నేతల నిర్బంధం

Date : 19 September 2026 02:43 PM Views : 194

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్‌పై వ్యక్తిగత కక్షతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ, జన్వాడ ఫామ్‌హౌస్ అంశంలో వివాదాలు సృష్టిస్తోందని ఆరోపిస్తూ ఆ పార్టీ నాయకులు నిరసనకు సిద్ధమయ్యారు.పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు జన్వాడ ఫామ్‌హౌస్‌కు వెళ్లేందుకు సిద్ధమైన పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్ ఆవరణలో జన్మదిన వేడుకలను పూర్తి చేసుకుని బయటకు వెళ్లే క్రమంలో, పటాన్‌చెరు పోలీసులు కన్వెన్షన్ హాల్ ప్రధాన గేటుకు తాళం వేసి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను అక్కడే నిర్బంధించారు.జన్వాడ ఫామ్‌హౌస్‌కు వెళ్లకుండా తమను అడ్డుకోవడంపై బీఆర్‌ఎస్ నాయకులు పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో జీఎంఆర్ కన్వెన్షన్ హాల్ వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :