Tuesday, 10 November 2026 03:57:31 PM
# యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న* # భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రత్యేక పూజలు # సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి కలకలం.. రైతుల్లో భయాందోళన # పేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.60 వేల ఆర్థిక సహాయం # గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని బీజేపీ నాయకుల ధర్నా* # పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి

బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత

చీకట్లోనే శ్రీ సిద్ధి గణపతి ఉత్సవాలు.. అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం

Date : 25 September 2026 08:20 PM Views : 109

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గ్రామంలో శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భక్తులు, స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, రథోత్సవం, పల్లకి సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆలయ ప్రాంగణం చీకటిమయంగా మారిందని భక్తులు వాపోతున్నారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల సమయంలో విద్యుత్ సరఫరాపై ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో విద్యుత్ లేకపోవడంతో భద్రతపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు ఆలయ పరిసరాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి గల కారణాలను అధికారులు వెల్లడించడంతో పాటు, వెంటనే సమస్యను పరిష్కరించి ఉత్సవాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :