ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో నియోజకవర్గస్థాయి సమీక్ష నిర్వహించారు.ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం పరిధిలో సుమారు రూ.75 కోట్ల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు.పారిశుధ్యం, మంచినీరు, విద్యుత్, వీధిదీపాలు, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.పటాన్చెరు రెవెన్యూ పరిధిలోని పోచారం, లకడారం నూతన సబ్‌స్టేషన్లను సెప్టెంబర్‌లో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.సమావేశంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు