Friday, 25 September 2026 12:21:20 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

లంచం తీసుకుంటుండగా కీసర ఎస్‌ఐ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

రూ.10 లక్షలు డిమాండ్‌.. రూ.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ

Date : 17 September 2026 08:55 PM Views : 31

ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : ప్రజా పిలుపు కీసర, సెప్టెంబర్‌ 17: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. రూ.5 లక్షల లంచం తీసుకుంటున్న కీసర ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. కీసర చెరువు సమీపంలో కారులో నగదు తీసుకుంటుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.ఓ కేసులో నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించేందుకు రూ.10 లక్షలు లంచంగా డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా రూ.5 లక్షలు ఎస్‌ఐకి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. పోలీసుల వేధింపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.గణేశ్‌ నిమజ్జనం విధుల్లో ఉన్న సమయంలోనే ఎస్‌ఐ లంచం తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కీసర ఇన్‌స్పెక్టర్‌ ఆర్కపల్లి ఆంజనేయులు పాత్రపైనా ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. పోలీస్‌స్టేషన్‌తో పాటు సంబంధిత అధికారుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఏసీబీ డీఎస్పీ మజీద్‌ అలీఖాన్‌ ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :