ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : సెప్టెంబర్ 12న సిద్దిపేట జిల్లా కోర్టు సముదాయంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జి. సుదర్శన్ పిలుపునిచ్చారు.లోక్ అదాలత్ ద్వారా పరస్పర అంగీకారంతో కేసులను త్వరితగతిన, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. బుధవారం బ్యాంకు మేనేజర్లు, బీమా సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.మోటారు వాహన ప్రమాద పరిహారం, బీమా, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన రాజీ పడదగిన కేసులను గుర్తించి ముందస్తుగా చర్చలు జరిపి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.కార్యక్రమంలో న్యాయమూర్తులు వై. జయ ప్రసాద్, ఎన్. సంతోష్ కుమార్, వి. తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. రమేష్ బాబు, న్యాయవాదులు, బ్యాంకర్లు, బీమా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు