Thursday, 24 September 2026 08:55:48 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

తలుపులు మూసి.. ప్రజాస్వామ్యానికి తాళం

ఇస్నాపూర్ మున్సిపాలిటీలో వార్డు సభ్యుల సమావేశంపై విమర్శలు

Date : 11 September 2026 08:56 AM Views : 124

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * ఇస్నాపూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన వార్డు సభ్యుల సమావేశం తలుపులు మూసి జరపడం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజా సమస్యలు, వార్డుల అభివృద్ధి, మున్సిపాలిటీ పాలనకు సంబంధించిన అంశాలపై చర్చించాల్సిన సమావేశాన్ని బహిరంగంగా నిర్వహించాల్సి ఉండగా, తలుపులు మూసి సమావేశం నిర్వహించడంపై స్థానికులు, ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ప్రజలతో ముడిపడిన అంశాలపై జరిగే సమావేశాలకు పారదర్శకతే ప్రాధాన్యం కావాల్సి ఉండగా.. తలుపులు మూసి సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు? ప్రజలకు తెలియకూడని విషయాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అధికారులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన సమయంలో, సమావేశం నిర్వహణ తీరే అనుమానాలకు తావిచ్చేలా ఉండటం విమర్శలకు కారణమవుతోంది. ప్రజాస్వామ్యంలో తలుపులు తెరిచి పాలన సాగించాల్సిన అధికారులు.. సమావేశ మందిరానికి తాళం వేసే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారో స్పష్టం చేయాల్సిన బాధ్యత వారిపైనే ఉంది.వార్డు సభ్యుల సమావేశాన్ని తలుపులు మూసి నిర్వహించడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, సమావేశం నిర్వహణకు గల కారణాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పే అధికారులు.. ఆచరణలో మాత్రం తలుపులు మూసుకుంటే ప్రజలకు సమాధానం ఎవరు చెబుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :