Friday, 25 September 2026 10:17:56 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

సొంత నిధులతో 12 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహం

ఆల్విన్ కాలనీ చౌరస్తాలో భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Date : 28 June 2026 11:03 AM Views : 115

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : నేటి తరం యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, ధైర్యసాహసాలు, సేవాభావంతో ముందుకు సాగాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఆదివారం జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ చౌరస్తాలో తన సొంత నిధులతో ఏర్పాటు చేయనున్న 12 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వరాజ్య స్థాపనకు ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తి, పరాక్రమం, పరిపాలనా దక్షత, ధర్మరక్షణ, మహిళల గౌరవ పరిరక్షణ వంటి గొప్ప ఆదర్శాలతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ చూపిన మార్గం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తన సొంత నిధులతో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేస్తూ, ఆయన గొప్పతనాన్ని భావితరాలకు చాటిచెప్పే కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.ఆల్విన్ కాలనీ చౌరస్తాలో ఏర్పాటు చేయనున్న 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని రాబోయే మూడు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, శివాజీ అభిమానులు, యువకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విగ్రహ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :