Friday, 25 September 2026 01:21:48 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

పక్కగా భూ హక్కులకోసం రీసర్వే

భూ క్రయవిక్రయాల్లో మ్యాపులను అప్డేట్ చేయాలి:జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

Date : 30 June 2026 08:57 PM Views : 72

ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : పక్కగా భూ హక్కుల కోసం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.మంగళవారం శివంపేట్ మండలం లోని బీక్యాతాండ లో ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భూభారతి భూముల రిసర్వే గ్రామసభ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ,ఆర్డీవో ఎడి సర్వే ఎంపీడీవో గ్రామ సర్పంచ్ తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. శివంపేట మండలం 1946 సంవత్సరంలో రిసర్వే అయిందని, అప్పటి నుంచి చాలా సమస్యలు ఉన్నాయన్నారు. భూమి క్రయవిక్రయాల్లో మ్యాపులను కూడా అప్డేట్ చేయాలన్నారు.గ్రామాల్లో భూ నక్షల్లో సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భూ రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొంద పరుస్తామన్నారు. ఏలాంటి భూ వివాదాలు లేకుండా చేసి,భూమికి భూధార్ ను అందించడం జరుగుతుందన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశం అన్నారు.అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ... శాశ్వతంగా భూ సమస్యల పరిష్కారం కోసమే భూ రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ల్యాండ్ సర్వే అధికారి ఎ . కిషన్,, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :