Sunday, 08 November 2026 06:48:08 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న ప్రైవేట్ బౌన్సర్లు

ప్రత్యేక డ్రెస్ కోడ్‌లో బౌన్సర్లు.. ఓవర్ యాక్షన్‌పై విమర్శలు

Date : 27 September 2026 07:43 PM Views : 155

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బీరంగూడ: సంగారెడ్డి జిల్లా బీరంగూడ పట్టణంలో మాజీ వైస్‌ చైర్మన్‌ నందారం నరసింహగౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్‌ నిమజ్జన కార్యక్రమంలో ప్రైవేట్‌ బౌన్సర్ల వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది.నిమజ్జన కార్యక్రమంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే బాధ్యతలను కూడా ప్రైవేట్‌ బౌన్సర్లు నిర్వహిస్తూ కనిపించారు. ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌తో విధులు నిర్వహిస్తూ వాహనాల రాకపోకలను నియంత్రించే ప్రయత్నం చేశారు. అయితే, కొందరు బౌన్సర్లు అత్యుత్సాహంగా వ్యవహరించారనే విమర్శలు వినిపించాయి.ముఖ్యంగా బీరంగూడలోని కార్యక్రమ ప్రాంతానికి సమీపంలోనే అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఉండటంతో, సాధారణంగా ట్రాఫిక్‌ నియంత్రణ బాధ్యతలు నిర్వహించే పోలీసుల విధులను ప్రైవేట్‌ బౌన్సర్లు చేపట్టడం స్థానికంగా చర్చకు దారితీసింది.నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రతా చర్యలను పోలీసులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రైవేట్‌ సిబ్బందికి అప్పగించిన బాధ్యతలు, వారి అధికార పరిధిపై కూడా స్పష్టత ఉండాలని స్థానికులు కోరుతున్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :