Sunday, 08 November 2026 02:44:39 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

విద్యార్థినికి ఆకులు తినిపించిన ఘటన.. ప్రిన్సిపల్, టీచర్ సస్పెండ్

Date : 09 October 2026 11:38 AM Views : 321

ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : నర్సాపూర్: నారాయణపూర్ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థినికి చెట్ల ఆకులు తినిపించిన ఘటనలో ప్రిన్సిపల్ రజని, ఉపాధ్యాయురాలు శ్రీలత సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు గురుకులాల ప్రాంతీయ సమన్వయకర్త గంగారాం నాయక్ గురువారం ప్రకటన విడుదల చేశారు.గత నెల 28న తరగతి గదిని శుభ్రం చేస్తుండగా పొరపాటున కుర్చీ తగలడంతో ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు శ్రీలత, విద్యార్థినికి శిక్షగా పాఠశాల ఆవరణలోని చెట్ల ఆకులు తినిపించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో విద్యార్థిని వాంతులు చేసుకోవడంతో చికిత్స అందించారు.బాధిత విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించి ప్రిన్సిపల్, ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్ వేటు వేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :