Tuesday, 10 November 2026 03:56:51 PM
# యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న* # భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రత్యేక పూజలు # సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి కలకలం.. రైతుల్లో భయాందోళన # పేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.60 వేల ఆర్థిక సహాయం # గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని బీజేపీ నాయకుల ధర్నా* # పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి

*కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి*

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి, జిల్లా అటవీశాఖ అధికారికి వినతిపత్రం అందజేసిన జిన్నారం మున్సిపల్ చైర్మన్ నకిర్తి జనార్ధన్

Date : 05 August 2026 07:05 PM Views : 73

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జిన్నారం మున్సిపల్ పరిధిలోని కొడకంచి గ్రామ శివారులో సర్వే నంబర్ 285లో ఉన్న భూములకు సంబంధించి అసైన్డ్ భూ బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరుతూ జిన్నారం మున్సిపల్ చైర్మన్ నకిర్తి జనార్ధన్ ఆధ్వర్యంలో రైతులు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్‌ఓ)కి బుధవారం వినతిపత్రం సమర్పించారు.రైతుల కథనం ప్రకారం, గతంలో ప్రభుత్వం సుమారు 80 ఎకరాల భూమిని నిరుపేద రైతులకు అసైన్ చేసి పట్టాలు మంజూరు చేసింది. అయితే ఇటీవల అటవీశాఖ అధికారులు ఆ భూమి అటవీశాఖ పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ, రైతులు సాగు చేస్తున్న భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, తాము ఎన్నో ఏళ్లుగా స్వాధీనంలో ఉంచుకుని సాగు చేస్తున్న భూములను కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో అసైన్డ్ పట్టాలు పొందిన రైతులకు తిరిగి భూములపై పూర్తి స్వాధీనం కల్పించి న్యాయం చేయాలని, భూములపై సమగ్ర సర్వే నిర్వహించి వాస్తవాలను నిర్ధారించాలని వారు కోరారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతుల జీవనాధారమైన ఈ భూములను రక్షించి, సాగు చేసుకునేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి సమస్యను సమగ్రంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో విచారణ జరిపించి, భూములపై సర్వే నిర్వహించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మున్సిపల్ చైర్మన్ నకిర్తి జనార్ధన్ తెలిపారు.కొడకంచి గ్రామానికి చెందిన అసైన్డ్ భూ బాధిత రైతుల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని నకిర్తి జనార్ధన్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ శిల్ప నాగరాజు, కొడకంచి గ్రామానికి చెందిన అసైన్డ్ భూ బాధిత రైతులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :