ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ముత్తంగి గ్రామ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు వంతెన కింద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 15న రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి రోడ్డు దాటుతుండగా, పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న టీజీ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.బస్సును వెంకటాపూర్‌కు చెందిన పెద్దోళ్ల శంకరయ్య, తండ్రి దుర్గయ్య నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తికి తలతో పాటు శరీరంలోని ఇతర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సెప్టెంబర్ 16న ఉదయం సుమారు 5:30 గంటలకు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాల ద్వారా సమాచారం అందింది.మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. మృతుడిని గుర్తించే వారు లేదా ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌ను 8712661839, 944568141 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు.
Admin
ప్రజా పిలుపు