Saturday, 26 September 2026 12:25:28 PM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం

జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటల ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. *కంట్రోల్ రూమ్ నెంబర్ 08455-276155*

Date : 30 July 2026 03:37 PM Views : 62

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది.జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటల పాటు పనిచేసే ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.ప్రజల నుండి అందే అత్యవసర ఫిర్యాదులు,సమాచారం, నష్టం వివరాలను వెంటనే స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు చేరవేసి తక్షణ చర్యలు తీసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ప్రజలు భారీ వర్షాల కారణంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు, వరదలు, రహదారి అంతరాయాలు,చెట్లు కూలిపోవడం,విద్యుత్ సమస్యలు లేదా ఇతర ప్రమాదాలకు సంబంధించిన సమాచారాన్ని08455-276155 నంబర్‌కు వెంటనే తెలియజేయాలని తెలిపారు.కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహించదానికి సిబ్బందిని మూడు షిఫ్టుల్లో నియమించామని, అందిన ప్రతి ఫిర్యాదును రిజిస్టర్‌లో నమోదు చేసి సంబంధిత తహసీల్దార్‌కు వెంటనే పంపించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.జిల్లాలోని రెవెన్యూ, పోలీసు,పంచాయతీ రాజ్, మున్సిపల్, విద్యుత్, వైద్య, అగ్నిమాపక తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ప్రజలు అవసరం లేనప్పుడు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,వాగులు, చెరువులు, వరద నీటి ప్రవాహాల వద్దకు వెళ్లరాదని, అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలు,హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :