Thursday, 24 September 2026 08:55:50 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

22ఏ నిషేధిత జాబితాలో పేదల భూములు*

Date : 19 August 2026 09:44 PM Views : 53

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : 22ఏ నిషేధిత భూముల జాబితాలో తమ భూములు, ఇళ్లను చేర్చారంటూ అమీన్‌పూర్‌కు చెందిన బాధితులు తెలంగాణ భవన్‌కు తరలివచ్చారు. మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన బాధితులు తమ ఆవేదనను బీఆర్ఎస్ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు.దశాబ్దాలుగా నివాసముంటున్న ఇళ్లు, ప్లాట్లు నిషేధిత జాబితాలో చేరడంతో వాటిని విక్రయించలేక, తాకట్టు పెట్టలేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోయారు. పిల్లల చదువులు, వివాహాలు, వైద్య ఖర్చుల కోసం దాచుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులు ఇప్పుడు ఉపయోగపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ నిర్ణయాలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు నష్టపోతున్నాయని ఆరోపించారు. బాధితులకు అండగా ఉంటామని, 22ఏ నిషేధిత జాబితా సమస్యపై అసెంబ్లీలోనూ, క్షేత్రస్థాయిలోనూ పోరాడతామని బీఆర్ఎస్ నాయకత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన ప్రైవేట్ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలని బాధితులు డిమాండ్ చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :