ప్రజా పిలుపు / తెలంగాణ / సూర్యాపేట : కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు కలిపి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Admin
ప్రజా పిలుపు