Thursday, 24 September 2026 08:05:59 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలి:జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్*

Date : 23 September 2026 08:01 PM Views : 12

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన, హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ సంగీతతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కింగ్ కాని, అనామలీ జాబితాలో ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి సమర్పిస్తున్న ధ్రువపత్రాలను త్వరితగతిన పరిశీలించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.నోటీసులు అందుకున్న ఓటర్లు 12 రకాల గుర్తింపు, ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకదాన్ని సమర్పించాలని తెలిపారు. హియరింగ్‌కు హాజరై అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించేలా బూత్ స్థాయి ఏజెంట్ల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.జిల్లాలో 4,11,717 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా.. ఇప్పటివరకు 2,48,395 మంది ఓటర్ల హియరింగ్ ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కోరారు.సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సంగీత, సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :