ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జేపీ కాలనీ రోడ్ నంబర్ 2లో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ వైర్లు అస్తవ్యస్తంగా, రక్షణ లేకుండా బయటకు కనిపిస్తున్నాయి. కొన్ని తీగలు నేలకు సమీపంగా ఉండటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల సమయంలో విద్యుత్ షాక్ ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి దెబ్బతిన్న వైర్లను సరిచేసి, తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Admin
ప్రజా పిలుపు