Saturday, 26 September 2026 11:24:58 AM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

మూసివేసిన కంపెనీ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

దొంగతనం చేసేందుకు వచ్చి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ప్రాథమిక అనుమానం:భానూర్ పోలీసులు

Date : 20 July 2026 01:35 PM Views : 281

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందిగామ గ్రామ శివారులో విశాఖ రోడ్డుపై ఉన్న మూసివేసిన పెన్నో ప్లాస్ట్ కంపెనీ ప్రహరీ గోడ వెలుపల సోమవారం ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు.మృతుడు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగిన ముస్లిం వ్యక్తిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతుడివద్దఎలాంటిగుర్తింపుపత్రాలులభించకపోవడంతో అతని వివరాలు తెలియరాలేదు.భానూర్ సీఐ విజయకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, మూసివేసిన కంపెనీ ప్రాంగణంలోకి దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ప్రహరీ గోడ ఎక్కి లోపలికి ప్రవేశించే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారి గోడ వెలుపల ఉన్న పొదల్లో పడిపోయి మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో అనుమానం వ్యక్తమవుతోంది.ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని,పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణం స్పష్టమవుతుందని తెలిపారు.మృతుడి గుర్తింపునకు పోలీసులు చర్యలు చేపట్టారు.అతని వివరాలు తెలిసిన వారు లేదాఎవరైనా గుర్తిస్తే వెంటనే భానూర్ బీడీఎల్ పోలీస్ స్టేషన్‌కు 8712661840, 8712656727 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :