ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: ఉస్మాన్ నగర్ లో బీహెచ్ఈఎల్ ఎంప్లాయీస్ సైబర్ కాలనీలో సుమారు రూ.7 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉస్మాన్ నగర్ బిఆర్ఎస్ నాయకులు ఉమేశ్వర్ ఆధ్వర్యంలో కాలనీలో 100 మీటర్ల పొడవున సీసీ రోడ్డు నిర్మాణ పనులను సొంత నిధులతో చేపడుతున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. కాలనీల్లో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. సీసీ రోడ్డు నిర్మాణంతో స్థానికులకు రాకపోకల సౌకర్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు.ఉస్మాన్ నగర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉమేశ్వర్ మాట్లాడుతూ.. కాలనీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సొంత నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు సహకరిస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీహెచ్ఈఎల్ ఎంప్లాయీస్ సైబర్ కాలనీ అధ్యక్షుడు సంజీవ్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు మాధవరావు, కార్యదర్శి ఏడుకొండలు, కాలనీ ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు