Thursday, 24 September 2026 08:05:28 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి

సంగారెడ్డి జిల్లా కబడ్డీ క్రీడాకారులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచన

Date : 22 September 2026 06:46 PM Views : 19

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో సంగారెడ్డి జిల్లా క్రీడాకారులు ప్రతిభను చాటుకుని ప్రథమ స్థానాన్ని సాధించే దిశగా సమష్టి కృషి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే యువతకు ప్రోత్సాహం అందించడం ద్వారా జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత మంది క్రీడాకారులు ఎదగడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఈ నెల 26, 27, 28 తేదీలలో రాజన్న సిరిసిల్ల జిల్లా..వేములవాడ కేంద్రంగా జరగనున్న రాష్ట్ర స్థాయి జూనియర్స్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ పోటీల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జూనియర్స్ కబడ్డీ జట్టు కోసం పటాన్చెరు డివిజన్ పరిధిలోని పీవీ నరసింహారావు ఆడిటోరియంలో నిర్వహిస్తున్న పది రోజుల శిక్షణ శిబిరాన్ని మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణ, వారి ఫిట్‌నెస్‌, ప్రాక్టీస్ విధానం, కోచ్‌ల మార్గదర్శకాలను ఆయన స్వయంగా పరిశీలించారు. క్రీడాకారులతో మాట్లాడి పోటీలకు వారి సన్నద్ధత, ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి తెలుసుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రత్యర్థి జట్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు శారీరక దారుఢ్యంతో పాటు వ్యూహాత్మకంగా కూడా సిద్ధం కావాలని సూచించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కబడ్డీ మన దేశ సాంప్రదాయ క్రీడల్లో ఒకటని, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ క్రీడ ద్వారా వెలుగులోకి వస్తున్నారని అన్నారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదల, జట్టు సమన్వయంతో ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు.రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్‌లో సంగారెడ్డి జిల్లా జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పోటీలకు ముందు ప్రతి క్రీడాకారుడు తన సామర్థ్యంపై పూర్తి నమ్మకంతో ఉండాలని, జట్టు సభ్యుల మధ్య సమన్వయం పెంచుకోవాలని సూచించారు.క్రీడలు కేవలం పోటీ కోసం మాత్రమే కాకుండా యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా కోచ్‌లు, నిర్వాహకులు, క్రీడాకారులు ఎమ్మెల్యేకు శిబిరం నిర్వహణ, శిక్షణా కార్యక్రమాల వివరాలను వివరించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు క్రీడాకారులు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కబడ్డీ జాతీయ జట్టు మాజీ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, మాజీ కార్పొరేటర్ అంజయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కౌన్సిలర్ అంతి రెడ్డి, సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, వెంకటేష్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శి గౌతమ్, జూనియర్స్ కోచ్ పండు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :