ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : ప్రజా పిలుపు జూన్ 24 నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ భూలక్ష్మమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన గ్రామ పెద్దలు, దాతలు, భక్తులను అభినందించారు.అనంతరం గ్రామానికి చెందిన జోగు నర్సమ్మకు రూ.2.50 లక్షల విలువైన ఎల్‌ఓసీ (LOC)ను అందజేశారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం తన బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు