ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ పండుగ సందర్భంగా కూకట్‌పల్లి జిల్లాలోని ఆల్విన్ కాలనీ డివిజన్‌లో ఘనంగా ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించారు.ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఎన్టీఆర్ నగర్, కేటీఆర్ నగర్ కాలనీల్లోని దర్గాలను సందర్శించి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రేమ, సోదరభావం, శాంతి, మానవత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు