Monday, 09 November 2026 03:09:54 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఆగస్టు 27న గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి:అదనపు కలెక్టర్ పాండు

Date : 24 August 2026 07:18 PM Views : 70

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఈ నెల 27న గ్రామ, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పాండు సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.సంగారెడ్డి కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి అదనపు కలెక్టర్ పాండు సంబంధిత జిల్లా అధికారులతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ, ఆగస్టు 27న నిర్వహించే గ్రామ, వార్డు సభల్లో బీఎల్‌ఓలు డ్రాఫ్ట్‌ ఓటరు జాబితాలోని ఓటర్ల పేర్లతో పాటు ఏఎస్‌డీ జాబితాలోని ఓటర్ల పేర్లను ప్రజలకు చదివి వినిపించాలని సూచించారు.18 సంవత్సరాలు నిండిన అర్హులైన పౌరులు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకునే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. డ్రాఫ్ట్‌ ఓటరు జాబితాలో పేరు, చిరునామా, ఇతర వివరాల్లో తప్పులు ఉన్నట్లయితే ఫారం-8 ద్వారా సవరణలకు దరఖాస్తు చేసుకునేలా వివరించాలని సూచించారు. అర్హత లేని వ్యక్తుల పేర్లు ఓటరు జాబితాలో నమోదై ఉన్నట్లయితే, వాటిని తొలగించేందుకు ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.మ్యాపింగ్‌ కాని, అనామలీస్‌గా గుర్తించిన ఓటర్లందరికీ నోటీసులు జారీ చేయాలని, ప్రతి నోటీసులో విచారణ తేదీ, సమయం, ప్రదేశాన్ని స్పష్టంగా పేర్కొనాలని తెలిపారు. నోటీసు జారీ చేసిన తేదీకి, విచారణ తేదీకి మధ్య కనీసం 7 రోజుల వ్యవధి ఉండేలా చూడాలని సూచించారు. నోటీసులు అందజేసిన వివరాలను బీఎల్‌ఓ యాప్‌లో ఫొటోతో సహా నమోదు చేయాలని ఆదేశించారు.గ్రామ, వార్డు సభల నిర్వహణకు సంబంధించిన వివరాలను సక్రమంగా డాక్యుమెంటేషన్‌ చేయాలని, సభలకు సంబంధించిన ఫొటోలను బీఎల్‌ఓ రిజిస్టర్‌లో భద్రపరచాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా అధికారులు, బీఎల్‌ఓలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ, జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా నోటీసుల జనరేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 27న నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై వివరించినట్లు తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :