Monday, 10 August 2026 10:39:46 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

Date : 19 July 2026 08:59 PM Views : 69

ప్రజా పిలుపు / తెలంగాణ / హైదరాబాదు : శేరిలింగంపల్లి నియోజకవర్గం భారతీనగర్ డివిజన్ బీహెచ్‌ఈఎల్ ఎంఐజీ కాలనీలోని శ్రీ రామాలయంలో నిర్వహించిన మూడో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి ఆదర్శ్ రెడ్డి, భారతీనగర్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలునిర్వహించారు.ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులకు పూర్ణకుంభ స్వాగతం పలికి వేదమంత్రాల నడుమ ఆశీర్వచనాలు అందించారు. అనంతరం శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సోదరభావం, భక్తిని పెంపొందిస్తాయని అన్నారు. ఇలాంటి ధార్మిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందిస్తూ, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దైవానుగ్రహాన్ని పొందాలనికోరారు.కార్యక్రమంలో మియాపూర్ మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్, రఘునాథ్ రెడ్డి, కాలనీ నిర్వాహకులు నారాయణ గౌడ్, నీలకంఠం, ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ, జనార్ధన్, నారాయణ, రామ్ ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :